రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాం

– గతంలో కంటే బీజేపీ బలపడింది
– వోటు షేరు 13 నుంచి 20శాతం పెరిగింది
– 5 మున్సిపాలిటీలు కైవసం
– త్రిముఖ పోటీతో పార్టీకి నష్టం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కా ర్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు అధికారికంగా బిజెపి 250కు పైగా వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. దాదాపు 6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, హైదరాబాద్లోని పార్టీ కా ర్యాలయంలో మీడియాకు తెలిపారు. మొట్ట మొదటి సారిగ నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తాం దన్నారు. ము న్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 70 డివిజన్ల వరకు గెలిచే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ తది తర ప్రాంతాల్లో గతంలో కంటే బీజేపీ మెరు గుపడింది. మొత్తం కలిపి కార్పొరేషన్లు, వా ర్డు మెంబర్లు కలిపి 320 నుంచి 350 స్థానా ల్లో బిజెపి విజయం సాధించే దిశగా ఉంది. 5 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసు కుంటున్నాం. వేములవాడ, రాయికల్, నా రాయణ పేట్, ఆదిలాబాద్, మెట్పల్లి.. ఈ ప్రాంతాల్లో చైర్మన్ పదవులను కూడా బిజెపి గెలుచుకుంటోందన్నారు. గతంలో కేవలం 2 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధిం చగా, దాదాపు 241 వార్డు మెంబర్లు గెలిచా రు. ఈ సారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగిం దన్నారు. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకువ స్తాం, మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చే స్తామనేది వివరించాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలు, అవినీతి, ప్రజలకు చేసిన మోసాలు, అన్యాయంపై చార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 350 సీట్లు గెలిచే దిశగా ఫలితాలు కనపడుతున్నాయన్నారు. సుమారు 200 వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థులు స్వల్పంగా ఓడిపోయారు. త్రిముఖ పోటీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో బిజెపి కి కొంత నష్టం జరిగిందన్నారు. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా బిజెపి ఖాతా తెరిచిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక డివిజన్లో విజయం సాధించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ రాలేదు.. చాలాచోట్ల హంగ్ పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయమేమీ కాదు. సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనేనని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న పార్టీ. బీఆర్ఎస్ దిగజారుతున్న పార్టీ. బిజెపి ఓటు షేర్ 13% నుంచి 20 శాతానికి పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బైంసా ప్రాంతాల్లో చైర్మన్ స్థానాలను గెలుచుకుంటామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *