బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని మండలిలో విపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్ తన శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్ తెచ్చారని వెల్లడిరచారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా ఈ రేస్ చేపట్టారన్నారు. మొదటి రేసు విజయవంతమైందని, రెండో రేసుని ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు.
హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. చాలా పారదర్శకంగా చెల్లింపులు జరిగాయని వెల్లడిరచారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతునందుకే ఈ అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదని చెప్పారు. ఎలాంటి కేసుల్కెన ధ్కెర్యంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. కేటీఆర్‌ప పెట్టిన కేసు అక్రమమని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రేస్ తెచ్చారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని వెల్లడిరచారు. హైదరాబాద్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ తెచ్చారని చెప్పారు. కేటీఆర్ మీద కేసులు పెట్టడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి సూచించారు.





