– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్, మార్చి 30: ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
’ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద విషయం కాదు. మా ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఆ ద్వీపాన్ని మేం స్వాధీనం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. కొన్నాళ్లు మా ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణ కోసం ఇంకే మిగలలేదని అనుకోవడం లేదు. కానీ, ఒక్కసారి మేం దాడి మొదలుపెడితే.. ఖర్గ్ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్‌పై భూతల దాడులు చిట్టచివరి ఆప్షన్ మాత్రమే’ అని ట్రంప్ పేర్కొన్నారు అంతేకాదు.. ఇరాన్ హర్మూజ్‌లో టోలు వసూలుచేస్తున్నట్లు వచ్చిన వార్తల పైనా ట్రంప్ స్పందించారు. అదే నిజమైతే అమెరికా దానిని రెండు నిమిషాల్లో మూసేయిస్తాయని భరోసా ఇచ్చారు. సౌదీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇరాన్‌పై తిరగబడుతున్నాయన్నారు. ఇక అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి దాదాపు 3,500 మంది మెరైన్లతో పశ్చిమాసియాకు చేరుకొంది. ఇది ఈనెల 27న తమ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. యూఎస్‌ఎస్ ట్రిపోలిపై ఎఫ్-31లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యూఎస్‌ఎస్ బాక్సర్‌తోపాటు శాన్‌డిగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనిట్లు, అదనపు బలగాలూ పశ్చిమాసియాకు చేరుకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




