– భవిష్యత్లో మరింత సమర్థంగా పనిచేస్తాం
-బీఆర్ఎస్పై మాట్లాడిన వారి నోళ్లు మూయించాం
– డబ్బు, మద్యంతో విజయం సాధించిన కాంగ్రెస్
– సింగరేణిలో అక్రమాలను బయటపెట్టగలిగాం
– మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అధికార పార్టీ సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించినా ప్రజల మనసును గెలుచుకోలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సహజం గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటా యి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. బీఆర్ఎస్ ఏదేదో మాట్లాడిన వారి నోళ్లు మూత పడేలా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. రేవంత్రెడ్డికి అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మె ల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల కు వెళ్లాలి. ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫ లమయ్యాం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగ డుతున్నాం. అందుకే ప్రజల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమ వుతోంది. అధికార పార్టీ 80-90శాతం గెలి స్తేనే గెలుపు అవుతుంది. స్థానిక ఎన్నికలు కాబట్టే స్థానికంగానే ప్రచారం చేశాం. పని తీరు బాగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని కేటీ ఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారులు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందే తప్ప నిజమైన విజయం కాదన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకోవడంలో కాం గ్రెస్ విఫలమైందన్నారు. మా విజయంతో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయ న్నారు. 2,581 మున్సిపల్ వార్డులలో ఎన్నిక లు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతా నికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 40 శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించామని గుర్తు చేశారు. కేంద్రంలో బీజే పీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను ఎదుర్కొంటామన్నా రు.
బీజేపీని నిలువరించేందుకు సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోరాడామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు సింగరేణి గొంతు కోస్తు న్నాయని మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో బయటపెడితే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందో తెలియడం లేదన్నారు.సింగరేణిలో జరుగుతున్న అరాచాకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్నారు. హంగ్ ఏర్పడిన మున్సి పాలిటీల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూ డాలన్నారు. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పోరా టం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తల కు, సోషల్ డియాలో అండగా నిలబడ్డ తమ్ము ళ్లకు, చెల్లెళ్లకు, వోటేసిన ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ తెలిపారు. దాదాపు 700-800 వార్డుల్లో గెలుస్తామని భావించాం. 15 మున్సిపాలిటీల్లో మేం స్పష్టంగా గెలిచాం. మరో 37 మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు వచ్చి హంగ్ పరిస్థితి ఉంది. మా కార్యకర్తలు వీరోచితంగా పోడారు. గద్వా లలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. వర్ధన్నపేటలో పలుమార్లు రీ కౌంటింగ్ చేయడంతో అక్కడ మా కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 122, కాంగ్రెస్ 4, బీజేపీ, 2, ఎంఐఎం 2 చోట్ల గెలిచాయి. ప్రస్తుత మున్సి పల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30శాతానికి పైగా వార్డులు గెలిచింది. మొత్తంమీద మంచి ఫలితాలు వచ్చినట్టు భావిస్తున్నాం. కొన్ని చోట్ల కాం గ్రెస్ పార్టీ అధికారులను అడ్డంపెట్టుకుని విజ యం సాధించింది.. డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన తర్వాత కేతన్పల్లి మున్సిపా లిటీలో సీపీఐ కూడా మాతో కలిసి వచ్చింది. దీంతో అక్కడ విజయం సాధించాం. హంగ్ ఏర్పడిన చోట చైర్మన్ పీఠాలు కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టింది. కాంగ్రెస్, భాజపా రెండూ కుమ్మక్కయ్యాయి. సింగరేణిలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సీపీఐ మాతో కలిసి రావాలి. కాంగ్రెస్, భాజపాను ఎండగట్టేందుకు కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐకి మద్దతిస్తాం. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఇదే విషయం చె ప్పా. కాంగ్రెస్, బీజేపీను ఎదుర్కొనే శక్తి బీఆర్ ఎస్కు మాత్రమే ఉందని, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు భావి స్తున్నారు. భవిష్యత్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. కలిసొచ్చే తటస్థులను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసక్తికర కామెంట్స్ చేశారు. కొత్త గూడెంలో మాతో కలిసొస్తె సీపీఐకి అన్ కండి షనల్ సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గానూ సీపీఐకి 22, కాంగస్కు 22, బీఆర్ఎస్కు 8, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెరో స్థానం దక్కింది. మిగతా ఆరు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఇప్పుడు మేయర్ పదవి దక్కాలంటే సీపీఐకి ఇంకా 9 స్థానాలు అవసరం. ఎమ్మెల్యే కూనమనేని ఎక్స్ ఆఫీసియో వోటుతో పాటు బీఆర్ఎస్ 8 వోట్లు కలిస్తే కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐకి దక్కే అవకాశముంది. ఇవాళ సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి దోచుకుంటున్నాయి. సింగరేణి లో దోపిడిని అడ్డుకోవడంలో మాతో కలిసొస్తే సీపీఐకి మద్దతిస్తామని కేటీఆర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





