మోదీ దుర్మార్గాలపై యుద్దం చేయాలి

– ఇరాన్ లాంటి దుస్థితి భారత్‌కు రాకూడదు
– మోదీ తీరుతో ప్రమాదంలో దేశ పరిస్థితి
– వికారాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్
– శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ తప్ప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందుకు కార్యకర్తలు యుద్దం చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ ఎసఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీఏసీ సభ్యులతో రాహుల్ గాంధీ భేటీ అయి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన ఆయన యుద్దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో`అమెరికన్ ట్రేడ్ డీల్‌తో ప్రమాదం ఉందని చెప్పారు. తెలంగాణలో పార్టీ.. ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని కితాబు ఇచ్చారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాలని పార్టీ సీనియర్ నేత వీహెచ్ కోరగా అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల పీఏసీ సభ్యులు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ, ఏపీ పీసీసీ చీఫ్‌లు మహేశ్‌కుమార్ గౌడ్, షర్మిలతోపాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్‌లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి అనంతగిరి హరిత రిసార్ట్స్‌లోƒ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. గత తొమ్మిది రోజులుగా ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ శిబిరం ఇక్కడ కొనసాగుతోంది. అంతుకుముందు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్‌కు సీఎం రేవంత్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి వికారాబాద్ వెళ్లారు. వికారాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీకి బొకేతో స్వాగతం పలికిన మంత్రి వివేక్ ఆయనను శాలువాతో సత్కరించారు. సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, సునీతారావులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై రాహుల్ గాంధీ చర్చించినట్లు సమాచారం. రాహుల్ గాంధీతోపాటు కేసి వేణుగోపాల్ సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *