– స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు
– కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం
– మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, శివరాత్రి లోపలే మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. బస్తీబాట కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం. పదేళ్లలో మేము చేసినవి.. కాంగ్రెస్ రెండేళ్లుగా చేయనివి గుర్తు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సర్వేలు, అభ్యర్థి బలాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో బలముంటే తప్ప స్థానిక ఎన్నికల్లో గెలవటం ఈజీ కాదు. జిల్లాలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. జనగాం, నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ఉంది. జిల్లాలు ఉండాలా.. పోవాలా..అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? రేవంత్ రెడ్డి తుగ్లక్ పనులతో జంట నగరాల అస్థిత్వం దెబ్బ తింటుంది . సినిమా టిక్కెట్లు పెంచేది లేదని యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఇంచార్జ్ నియమించామని, 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తామన్నారు. ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల దగ్గర ఇంచార్జ్ లుగా నియమిస్తాం. లోకల్ ఎన్నికలు కాబట్టి లోకల్ వాళ్లే ప్రచారం చేస్తారు. స్థానికత ఆధారంగా ప్రచారం నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. స్థానిక సమస్యలను ఎజెండాగా ముందుకు తీసుకొని వెళ్తాం. పఠాన్‌చెరువు ఎమ్మెల్యే కూడా మా బీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలి అంటున్నారు. మేము కూడా అదే అంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. సింగరేణిపై మంత్రులు మాట్లాడడం లేదు. సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హైద్రాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండే మేమేం మార్చలేదు. రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి తుగ్లక్.. సమాధానం చెప్పే వరకు ఆయన వెంట పడతాం అన్నారు. సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లా చేస్తాం అన్నారు.. ఇప్పుడు మళ్ళీ అదే జిల్లాను తొలగిస్తాం అన్నారు. అందుకే ఆయన రాము రెమో అని చెప్పుకొచ్చారు కేటీఆర్.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



