ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి
రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం
ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి
రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : గత పదేళ్లలో చేయని అభివృద్ధి తమ ప్రభుత్వం వొచ్చిన తర్వాత 15 నెలల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా ఎక్కడతా తగ్గడం లేదని రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ కార్యక్రమాలను ప్రతి పేదవాడికి అందే విధంగా పనిచేస్తున్నామని తెలిపారు. శుక్రవారం మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని, పేదవాళ్లే కావచ్చు ధనికులు కావచ్చు రూ.10 లక్షల వరకు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
500 రూపాయలకే ఉచిత గ్యాస్ పథకం, వాటితోపాటు రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకు 50 వేల నుంచి 4 లక్షల వరకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ఈనెల 14న ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి పేద కుటుంబాలు తృప్తిగా భోజనాలు చేయాలని ఉగాది పండుగ రోజున సన్న బియ్యం పంపిణీని ప్రారంభించామని చెప్పారు. తమ ప్రభుత్వం వొస్తే రైతులను రాజుని చేస్తామని వాగ్దానం చేశామని, అన్నమాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేశామని చెప్పారు. 25 లక్షల 65 వేల మందికి 687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసి సన్న వడ్లు పండించే రైతన్నలకు ఎకరానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. త్వరలో పినపాక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో పరిష్కరించకుండా ఉన్న పులుసు బొంత ప్రాజెక్టును రాబోయే కొద్ది నెలల లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతున్నామని మంత్రి తెలిపారు. ఈనెల 14 నాడు అంబేడ్కర్ జయంతి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పారామంలో సాయంత్రం 5 గంటలకు భూ భారత చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. అద్భుతమైన భూ భారతి చట్టం 2025 ని అన్ని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకు ఆహ్వానించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములను ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు, కుట్రలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





