– 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు
– అసెంబ్లీలో తేల్చుకోనున్న ఇరు పక్షాలు
– బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం
– ఆధారాలతో సిద్ధమవుతున్న బీఆర్ఎస్
(ప్రజాతంత్ర,హైదరాబాద్)
అసెంబ్లీ సమావేశాలకు అధికార కాంగ్రెస్ సిద్దమైంది. ఈనెల 29 నుండి (మధ్యలో రెండు రోజులు మినహాయించి) నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సమా వేశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా తీరును ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంగా ప్రణాళికను అధికారపక్షం సిద్ధంచేసుకుంటున్నది. ప్రధా నంగా తెలంగాణ ఉద్యమానికి మూలకారణ మైన నదీజలాల వివాదాల విషయంలో బిఆ ర్ఎస్ ప్రభుత్వం గత ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలు న్నాయి. నీటి కేటాయింపుల విషయంలో సక్ర మమైన వాటా కోసం కొట్లాడాల్సిందిపోయి, అభినవ దానకర్ణుడిలా ఆంధ్రప్రాంతానికి అధిక కేటాయింపుకు కారకుడిగా మారాడం టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కెసిఆర్పై న దుమ్మెత్తిపోస్తున్నది. నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడాన్ని కెసిఆర్ ప్రశంసించిన తీరుపైన కూడా కాం గ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ‘నీళ్ళు, నిజా లు’ అంశంగా కృష్ణా, గోదావరి నదీజలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని అన్ని ఆధారా లతో ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్ర జలకు తెలియజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగిన ఏర్పా ట్లు కూడా చేసుకుంటున్నది. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ముఖ్యంగా కృష్ణా జలా ల్లో రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఏ విధం గా వైఫల్యం చెందిందన్న విషయాన్ని ఆధా రాలతో సహా వెల్లడించేందుకు సిద్ధం కావా లని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అనధి కార మంత్రుల సమావేశంలో సూచించిన తతతీరు ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గానే జరుగేట్లుగానే కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ హయాంలో నీళ్ళ విషయంలో తీసుకున్న నిర్ణయాలైతేనేమీ, నాటి ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖల సారాంశం, కుదు ర్చుకున్న ఒప్పంద పత్రాలను సభలో ప్రద ర్శించడం ద్వారా పదేళ్ళుగా బిఆర్ఎస్ ప్రభు త్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నగ్నం గా చూపించాలన్న వ్యూహరచన చేస్తున్నది కాంగ్రెస్. ఈ విషయంలో గత ఆదివారం బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన సుదీర్ఘ వివరణంతా తప్పులతడకగా కాంగ్రెస్ భావిస్తున్నది. దీన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సిఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. అంతేకాకుండా నీళ్ళ కేటాయింపుల విషయంలోగాని, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలోగాని కెసిఆర్ ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగ్లను ఊరూరా ప్రచారం చేయాలని సిఎం కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ కూడా అదేస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నది. వాస్తవంగా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంలోనేనని ఆ పార్టీ వాదిస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని, సిఎం రేవంత్రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలముందు తేటతెల్లం చేస్తామంటున్నారు బిఆర్ఎస్ నాయకులు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవంగా రాష్ట్రానికి 90 టీఎంసీల నీటి కేటాయింపు జరుగాల్సి ఉండగా, 45 టీఎంసీల కే అంగీకరించారంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు వర్గాలు కూడా అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల గురించి వాదోపవాదాలు చేసుకుం టున్నారు. ఇరు పార్టీలు కూడా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్క కూడా ఎట్టిపరిస్థితిలో వదులుకునేది లేదంటున్నాయి. కాగా, ఎవరి హయాంలో ఏమేరకు అన్యాయం జరిగింది, ఎవరి లేఖల కారణంగా అన్యాయం జరుగుతున్నదన్నది ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా తేటతెల్లం కావాలని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.
————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





