– భార్యను గెలిపిస్తే ఫ్రీ కటింగ్ అంటూ ప్రచారం
సిద్దిపేట,ప్రజాతంత్ర,డిసెంబరు4: రాష్ట్రంలో ప్రస్తుతం వోట్ల పండగలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు కోతులను తరిమిస్తామని హా ఇవ్వగా, కొందరు రకరకాల హాలు ఇస్తున్నారు. పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో వోటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. డబ్బు పంచడం ఓ ఎత్తు అయితే కొందరు చీరలు, వివిధ వస్తువులను బహుమతిగా అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్డ్ మెంబర్ ఎన్నికల ప్రచారం సోషల్ డియాలో చర్చకు దారి తీసింది. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్ చేస్తానని ఆమె భర్త ప్రకటించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్ల కొడుతోంది..నా భార్యని వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే మగవారందరికీ కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానని ఓ భర్త వినూత్న ప్రచారం చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఓ మహిళ వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తోంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘోత్తంపల్లిలో వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తున్న మహిళ కూడా ప్రచారం మొదలెట్టింది. సదరు మహిళ భర్త క్షురకుడు కావడంతో ప్రచారం వినూత్నంగా మొదలెట్టాడు. తన భార్యను వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే.. వార్డులోని మగవారందరికీ ఐదేళ్ల పాటు కటింగ్ , షేవింగ్.. ఫ్రీగా చేస్తానని చెబుతున్నాడు. ఇంటింటికీ వెళ్లి ఈ ఆఫర్ చెబుతూ.. తన భార్యను గెలిపించాలని కోరుతున్నాడు. తడి వింత ఆఫర్ వినేందుకు వినూత్నంగా ఉండడంతో సోషల్ డియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.