వరంగల్ ఇక ‘వీకెండ్ డెస్టినేషన్’..

» 100 పర్యాటక ప్రాంతాల గుర్తింపునకు మంత్రి కొండా సురేఖ శ్రీకారం!
>> తెలంగాణ ‘వీకెండ్ వండర్స్’ పోస్టర్ ఆవిష్కరణ
» కొత్త పర్యాటక ప్రాంతాల సమాచారంపై పోటీలు
» జనవరి 5లోపు ఎంట్రీలకు ఆహ్వానం
» సంక్రాంతికి అవార్డుల ప్రదానం

వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: చారిత్రక నగరమైన వరంగల్ను పర్యాటక హబ్గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అద్భుతమైన, వెలుగులోకి రాని పర్యాటక ప్రాంతాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా మార్చేందుకు పర్యాటక శాఖ చేపట్టిన సరికొత్త ప్రచార పోస్టర్ను రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఆవిష్కరించారు. వరంగల్ కలెక్టరే ట్లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ స్నేహా శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. పర్యాటక శాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ గా చెయ్యడానికి ఔత్సాహికుల నుండి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యడానికి ఈ పోటీని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రూపొందించిన పోస్టర్ ను మం త్రి కొండా సురేఖ విడుదల చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశం లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ స్నేహా శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పై, జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజీ, ఇతర అధికారులు పోస్టర్ ను విడుదల చేశారు. రాజధాని హైదరాబాద్ నుం చి రెండు, మూడు గంటల ప్రయాణంలోనే చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వైభవం, అభయారణ్యాలను ఆస్వాదించాలంటే ఉమ్మడి వరంగల్ ను సందర్శించాల్సిందే. కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం, ఘనపురం కోటగుళ్లు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, భోగత జలపాతం, మేడారం జాతర, ఏటూరునాగరం, తాడ్వాయి అభయా రణ్యాలు, పాండవుల గుహలు దేశ, విదేశీ పర్యాటకులు ఇష్ట పడే ప్రాంతాలు చాలా ఉన్నాయి. సాహస క్రీడల ప్రాంతాలు, చరిత్రక లోకల్ ఫుడ్ వరంగల్ కు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లా లోని పర్యాటక ప్రాంతాల పరిచయంలో భాగం గా 100 ప్రదేశాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా మార్చేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ సరికో త్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇప్పటికి అంతగా వెలుగులోకి రానివి ఈ జాబితాలో చేరుస్తోంది. ఆయా ప్రాంతాలకు హైదరాబాద్ తో పాటు జిల్లాల నుం పర్యాటకుల్ని పెంచా లన్నది ప్రధాన లక్ష్యం.

వీకెండ్ ట్రిప్ ప్లాన్స్
వీకెండ్ ట్రిప్ లపై ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్లోనే సుమారు 10 లక్షల మంది ఉంటారని పర్యాటక సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులతోపాటు వర్సిటీల్లో విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు తమ స్నేహితులు, కుటుంబాలతో ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారని గుర్తించింది. ఈ హైపర్ లోకల్ టూరిస్టులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి 50-200 కి.మీ. దూరంలో 100 వారాంతపు పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సేకరిస్తోంది. ప్రధానంగా శని, ఆదివారాలు.. లేదా ఇతర సెలవు రోజుల్లో ఒకట్రెండు రోజులు సరదాగా వెళ్లివచ్చే ప్రదేశాలను ఈ జాబితాలో చేరుస్తోంది. ఆయా ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, సమీపంలోని వసతి సదుపాయాలు.. అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్, స్థానిక వంటకాలు వంటి పూర్తి సమాచారాన్ని పర్యాటక సంస్థ అధికారులు సేకరిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగా ణ’ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నట్లు టూరి జం డెవల ప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి వెల్లడించారు. తెలంగాణలోని పర్యాటక ప్రదే శం స్పష్టంగా కనిపించేలా 3 ఫొటోలు, 60 సెకె న్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా ఎంట్రీలను పంపా లని సూచించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇస్తామన్నారు. పదిమందికి కన్సొలేషన్ బహుమతులు అంద జేస్తామన్నారు. సంక్రాంతి రోజున కైట్ ఫెస్టివల్లో బహుమతులను ప్రదానం చేస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *