– ప్రజాభవన్‌లో ‘వార్ రూమ్’ను సందర్శించిన సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్ లక్ష్యాలు, ప్రపంచంలో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ముందుచూపుతో విజన్ డాక్యుమెంట్‌ను మరింత సమగ్రంగా మెరుగుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్‌ను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో తెలంగాణ సామర్థ్యాన్ని, అభిలాషను, వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిపాదించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రూపుదిద్దాలని స్పష్టం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులతో కలిసి ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్ రూమ్‌ను సందర్శించి, సన్నద్ధతలు, సమ్మిట్ కార్యకలాపాల పురోగతిని వివరంగా సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పాంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





