యుద్ధం బాధ క‌లిగిస్తోంది

– నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరుగుతున్నాయి
– పెట్రోల్‌, డీజిల్‌, వంట‌గ్యాస్  కొర‌త ఏర్ప‌డుతోంది
– హ‌రీష్‌రావు

సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10:  పవిత్ర రంజాన్ మాసం లో జరుగుతున్న యుద్ధం చాలా బాధకలిగిస్తున్నద‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఆవేదన వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇచ్చిన‌ ఇఫ్తార్ విందులో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  యుద్ధం వల్ల ఇరాన్.. ఇజ్రాయల్, అమెరికా దేశాలలో సైనికులు సామాన్యులు చనిపోతున్నారన్నారు.  గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు.. భారతీయులు ఇబ్బంది పడుతున్నారు.  యుద్ధం ప్రభావం అన్ని దేశాల ప్రజల పై పడుతున్నది. ముఖ్యంగా భారత దేశంలో పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడుతున్నది.. ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింద‌న్నారు.  నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.  భగవంతుని దయతో.. అల్లా దయతో యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకుందామ‌ని ఆకాంక్షించారు.  యుద్ధం అనేక సమస్య లను సృష్టిస్తుంది.  కేసీఆర్‌ హయాంలో మైనారిటీ ల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశార‌ని గుర్తుచేశారు.  రంజాన్ తోఫా.. షాదీముబారక్..అమలు చేశారు అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.  పేద మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాల లు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది.  మైనారిటీ లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *