– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1ః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ గత సంవత్సరం (2025)లో ముందుకు సాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. నూతన సంవత్సర ం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన గురువారం శుభాకాంక్షలు తెలిపారు. అదే స్ఫూర్తితో మోదీ అడుగుజాడల్లో నడుస్తూ 2026లో భారతదేశాన్ని వికసిత్ భారత్”గా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. త్వరలోనే ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకునే దిశగా దేశం వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో మనందరం “నేషన్ ఫస్ట్” అనే భావనతో దేశానికి మన జీవితాన్ని అంకితం చేస్తూ భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన మార్గంలో నడుచుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





