లద్దాఖ్‌ అల్లర్లలో ప్రమేయం

– పర్యావరణవేత్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ అరెస్ట్‌

లేహ్‌,‌సెప్టెంబర్‌26: ‌లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం వాంగ్‌చుక్‌ ‌ప్రకటనలతోనే లేహ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయని కేంద్రం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 90 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్‌లో కొంతకాలంగా రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు మూడేళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్క•తి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌రెండువారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్‌ ‌కింద చేర్చాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ విషయంలో కొద్ది రోజులుగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దీంతో ఈ పరిస్థితికి వాంగ్‌చుక్‌ ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.24 గంటలు తిరగకముందే ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ’ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్‌ అం‌డ్‌ ‌కల్చరల్‌ ‌మూమెంట్‌ ఆఫ్‌ ‌లద్దాఖ్‌’‌కు పై చర్యలు చేపట్టింది. ఎన్జీవో పనితీరులో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘన వంటి కారణాలతో లైసెన్స్‌ను రద్దు చేసింది. కాగా హోంమంత్రిత్వ శాఖ లద్దాఖ్‌ ఆం‌దోళనకు మూలకారణంగా తన పేరు ప్రస్తావించడాన్ని గురువారం వాంగ్‌చుక్‌ ‌తప్పుబట్టారు. అసలు సమస్యను పక్కనపెట్టిన తనను బలిపశువును చేశారని ఆరోపించారు. ఇది ఎంతమాత్రం తెలివైన నిర్ణయం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *