– గురుగ్రామ్‌లో ప్రమాదం
గురుగ్రామ్, మార్చి 10 : హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్ సిధ్రావాలి ప్రాంతంలోని సిగేచర్ గ్లోబల్ సొసైటీలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. సుమారు 15మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృం దాలు సహాయక చర్యలు చేపట్టాయి. యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించారు. గంటపాటు కొనసాగిన సహాయక చర్యల తర్వాత కార్మికులను బయటకు తీసి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఏడుగురు కార్మికులు మరణించారని వైద్యులు నిర్థారించారని, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిర్మాణ సంస్థ అధికారులెవరూ స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




