దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్
నంగునూరు రైతు ధర్నా వేదికగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
రేతవంత్‌రెడ్డి రుణమాఫీ ఇచ్చేదాకా వొదిలిపెట్టం అంటూ నినదించిన అన్నదాతలు
ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదనీ, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన నంగునూరులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో పెద్ద సంఖ్యలో అన్నదాతలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులనుద్దేశించి హరీష్‌రావు మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి మాటలు, కోతలు తప్ప చేతలు లేవనీ, రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యే వరకు రేవంత్‌రెడ్డిని నిద్ర పోనియ్యనని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం అని హెచ్చరించారు. కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు రైతుబంధు ఇచ్చాడనీ, కొరోనా టైంలోనూ రైతుబంధు ఇచ్చాడనీ, కేసీఆర్ హయాంలో మొత్తంగా 11సార్లు రైతుబంధు ఇచ్చాడని గుర్తు చేస్తూ..రేవంత్‌రెడ్డి సిఎం అవుతానని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వొస్తుందని అనుకోలేదనీ, దీంతో అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వొచ్చాక అందరినీ ఆగం చేస్తుండన్నారు.





