4న నూతన వీఆర్వోలకు నియామక పత్రాలు

– సీఎస్‌ రామకృష్ణారావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నూతనంగా నియమితులైన ఐదు వేలమంది విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లకు ఈనెల 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరోజు సాయంత్రం 4 గంటలకు జ‌రిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి ఎంపికైన వీఆర్వోలు మధ్యాహ్నం 2 గంటల లోపు హైటెక్స్‌కు చేరుకునేలా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వారి కోసం 120కి పైగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ సీఎండీని ఆదేశించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ నిర్వహణను చేపట్టాలని సైబరాబాద్‌ కమిషనర్‌ను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్‌లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, ఫైర్‌ సర్వీస్‌ డీజీ నాగిరెడ్డి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *