మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు

– పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి
– కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి
– రాహుల్‌తో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: కేరళం ప్రజలారా.. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పదేళ్ల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి.. అవినీతి పాలనను అంతం చేయండి.. విభజన రాజకీయాలను తిరస్కరించండి.. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం యూడీఎఫ్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. కేరళం భవిష్యత్తు కోసం పజలు సరైన నిర్ణయం తీసుకుని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని పేర్కొన్నారు. కేరళంలోని పతనం తిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్‌ముల నియోజకవర్గాలలో కేఎసఆర్టీసీ జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఏఐసిసి అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. కేరళంలో గత పదేళ్లుగా కొనసాగుతున్న ఎల్‌డీఎఫ్ పాలన ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని ఆరోపించారు. పదేళ్లుగా కేరళను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అవినీతి పాలనకు ప్రతీకగా మారిందని, యువతకు ఉద్యోగాలు లేవు.. పెట్టుబడులు రావడం లేదు.. సంక్షేమం కేవలం ప్రచారానికే పరిమితమైందని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బీజేపీకి కేరళంలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే పలుమార్లు తీర్పు ఇచ్చారు అని అన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం యూడీఎఫ్ మాత్రమేనని పొంగులేటి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను ఉదాహరణగా చెబుతూ తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తున్నామో దేశం చూస్తోంది.. అదేవిధంగా కేరళంలో కూడా ప్రజా పాలన తీసుకురాగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *