‘వోట్ చోరీ’ లోగో ఆవిష్కరణ

– గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బీహార్‌లో వోట్‌ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కార్యదర్శి విశ్వనాథన్‌, పీఏసీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణకు చెందిన ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ నిపుణుడు జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయమై పీఏసీ సమావేశంలో చర్చించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్‌ చోరీ.. గద్దీ చోడ్‌ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశంపైనా,
ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపదుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపైనా చర్చించారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం. గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం, రాష్ట్రస్థాయిలో పెండిరగ్‌లో ఉన్న కమిటీల నిర్మాణంపై, యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చ జరిగింది.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *