– గ్రామాల్లో సంతకాల సేకరణ
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: వోటు చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అదే వోటు చోరీతో మూడోసారి కూడా ప్రధాని కాగలిగారని, వోటుచోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వోటు చోరీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పుకొచ్చారు. వోటు చోరీతో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు వోటు చోరీ విషయంలో ప్రతి గ్రామంలో వందకు పైగా సంతకాలను సేకరిస్తున్నామని తెలిపారు. వోటు చోరీ జరిగిందని నమ్ముతూ తాను సంతకం పెడుతున్నానని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కనీసం వందకి తగ్గకుండా సంతకాలను టీపీసీసీ చేపడుతుందని తెలిపారు. వోట్ చోరీకి బీజేపీ పాల్పడిందని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. వోటు చోరీతోనే తెలంగాణలో బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారని తాను పాదయాత్రలో చెప్పానని అన్నారు. వోటు- చోరీపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఇప్పటివరకు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ ఈటల రాజేందర్ మూడు లక్షల వోట్ల గెలుపు వెనుక వోటు- చోరీ ఉందని ఆరోపించారు. వోటు- చోరీతో ప్రజాస్వామ్యానికి విఘాతమని చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్. వోటు- చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ వోటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు వోటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు వోటు- చోరీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వోటు- చోరీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. వోటు- చోరీని అరికట్టాలని కోరారు. వోటు- చోరీ సంతకాల సేకరణలో జర్నలిస్టులు, మేధావులు పాల్గొనాలని సూచించారు. బీహార్‌లో మూకుమ్మడిగా వోట్లను తొలగించారని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





