– పునరుద్ఘాటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
లక్నో, సెప్టెంబర్11: వోట్ చోరీ గురించి త్వరలో అణుబాంబు లాంటి ఆధారాలు వెల్లడిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బిజెపి వోట్ చోరీకి పాల్పడుతున్నదని పునరుద్ఘాటించారు.వోట్ చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వెల్లడించానని, భవిష్యత్తులో’ హైడ్రోజన్ బాంబ్ వంటి ఆధారాలు బయటపెడతానని అన్నారు.తన నియోజకవర్గం రారుబరేలీలో రెండు రోజుల పర్యటన కోసం రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్ చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిషా) సమావేశానికి అధ్యక్షత వహించారు. కలెక్టరేట్‌లోని బచత్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) గురించి మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక మరియు హర్యానాలో ఎన్నికలు దోచుకోబడ్డాయి. అధికారికంగా మరియు వ్రాతపూర్వకంగా నమోదు చేయబడిన సాఁ్‌యాలను సమర్పించానని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంచలన, ఎక్స్‌క్లోజివ్ ప్రూఫ్ వెల్లడించనున్నామని అన్నారు. వోట్ చోర్, గడ్డిచోర్ అనే నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. రాష్ట్రాల్లో వోట్లు దొంగిలించబడి ప్రభుత్వాలు ఏర్పడు తున్నాయన్నది వాస్తవమని, వాటికి కు రుజువు ఇస్తామని హా ఇస్తున్నామని అన్నారు. హైడ్రోజన్ బాంబు పేలినపుడు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బిజెపి నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





