15 నుంచి వృత్తి విద్యాసంస్థల బంద్

హైదరాబాద్ (కాళోజి జంక్షన్), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12:  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పట్ల తమ సహనం నశించిందని రాష్ట్రంలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశాయి. మూడేళ్లుగా పెండింగ్ ఉన్నఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిం చడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. మరోవైపు కళాశాలలో  విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టం అమలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకుండా కొత్త కొత్త విధానాలతో మెలిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత‌రం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు పాత్రికేయులతో మాట్లాడారు. ఈనెల‌ 15న వృత్తి విద్యా కళాశాలలన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే  యాజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే తాము చిట్టచివరకు ఈ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇంజనీర్స్ డేను బ్లాక్ డేగా జరపడం చరిత్రలో ఇదే మొద టిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలకు రూ.1200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ డాక్టర్ ఎన్.రమేష్బాబు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ రవి కుమార్, కోశాధికారి కే కృష్ణారావు, ఆర్గనై జింగ్ సెక్రటరీ డాక్టర్ కే సునీల్ కుమార్, డాక్టర్ కత్తి రాందాస్‌లు కళాశాలల మూసివేత‌పై ప్రకటించారు.  విద్యార్థి ముఖ గుర్తింపు హాజరు విధానంపై కూడా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *