జమలాపురపు విఠల్‌రావుకు వివేకానంద స్ఫూర్తి పురస్కారం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 12: జాతీయ తెలుగు సారస్వత పరిషత్‌, శ్రీ ఆదిలీల ఫౌండేషన్‌ న్యూదిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్‌ నేతృత్వంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు వివేకానంద స్ఫూర్తి పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా జర్నలిజంలో సేవలకు గుర్తింపుగా ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు జమలాపు రపు విఠల్‌రావు వివేకానంద స్ఫూర్తి పురస్కారాన్ని సముద్రాల వేణుగోపాలాచారి, వకుళాభరణం కృష్ణమోహన్‌, టి.నర్సిరెడ్డి, డా.కె. రాంప్రసాద్‌ల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ల్యాండ్‌ అక్విజిషన్‌ అథారిటీ ఫర్‌ ది స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ టి.నర్సిరెడ్డి, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, వకుళాభరణం కృష్ణమోహన్‌ హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *