-మార్చి 4న నేరుగా పరిశీలించాలని కమిషన్ నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల నియామకాలలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ అంశంపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో భాగంగా మార్చి 4వ వారంలో విద్యుత్ సంస్థల కార్యాలయాలను సందర్శించి దీనిపై విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలోని విద్యార్థుల వివరాల సేకరణ వేగవంతం చేయాలని కమిషన్ అధికారులకు సూచించింది. రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశం ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవి పాల్గొన్నారు. అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్ రావు, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



