స‌హ‌జ‌త్వం కోల్పోతున్న ప‌ల్లెలు

– మింగేస్తున్న ఆధునిక‌త‌
-పెరిగిన అనుత్పాద‌క ఖ‌ర్చు
– బ‌తుకుల‌ను తారుమారు చేసిన క‌రెన్సీ
– అంతా ప‌ట్నం పోక‌డలే
– గంగ‌లో క‌లిసిన గ్రామ స్వ‌రాజ్యం
– ప‌ట్ట‌ణాల‌కు ప‌రాన్న‌జీవులుగా మారిన వైనం

ప‌రిణామ‌గ‌తిలో మార్పు స‌హ‌జం. అయితే ఈ మార్పు గ‌తంకంటే మెరుగైన‌దిగా, ఉత్త‌మ జీవితాల‌కు మార్గ‌ద‌ర్శ‌నిగా వుండాలి త‌ప్ప‌, తిరోగ‌మ‌న ప‌థంలో ప‌య‌నించేదిగా వుండ‌కూడ‌ద‌ని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, సీనియర్ ఎడిటర్  కే రామచంద్ర మూర్తి , జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, రైతు నాయకులు కొల్లు కృష్ణారెడ్డిలు గ్రామాల స్థితిగ‌తుల‌పై జ‌రిపిన అధ్య‌య‌నం స్ప‌ష్టం చేస్తోంది. నేడు ప‌ల్లెల్లో వ‌చ్చిన విస్ప‌ష్ట మార్పును ఈ అధ్య‌య‌నం క‌ళ్ల‌కు కడుతోంది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ప‌రిశీలిద్దాం. వ్య‌వ‌సాయ ఆధారిత ఆర్థిక వ‌న‌రులు పూర్తిగా మారిపోవ‌డంతో, గ్రామీణ జీవ‌న‌విధానమే మారిపోయింది. ఒక‌ప్పుడు పాలు, కూర‌గాయ‌లు స్థానికంగానే ల‌భించేవి. నేడు వీటిని ప‌ట్ట‌ణాల‌నుంచి కొనుగోలు చేయాల్సి వ‌స్తోంది. గ్రామాలు త‌మ స‌హ‌జ‌త్వాన్ని కోల్పోయి ప‌ట్ట‌ణ జీవ‌నానికి న‌క‌లుగా త‌యార‌వుతున్నాయి. ఖ‌రీదైన ఫోన్ల వాడ‌కం, రీచార్జ్ లు, నెట్ బిల్లులు, కేబుల్ బిల్లులు, ద్విచ‌క్ర‌వాహ‌నాలు, అనుత్పాక పెట్రోల్ ఖ‌ర్చులు వంటివి గ్రామీణ జీవ‌నంతో పెన‌వేసుకుపోయాయి. ఫంక్ష‌న్లు స‌హ‌జ‌త్వాన్ని కోల్పోయి, ఆడంబ‌రాల‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. విందువినోదాలు, మ‌ద్యం, మాంసం వినియోగం బాగా పెరిగిపోయింది. ఉమ్మ‌డి కుటుంబాలు ఏనాడో క‌నుమ‌రుగ‌య్యాయి. భూక‌మ‌తాల విస్తీర్ణం త‌గ్గిపోయింది. వ్యవసాయ పoటల సాగులో వచ్చిన మార్పులు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి క్రమంలో పెరిగిన నీటివనరుల వినియోగం ఫలితంగాపడిపోయిన కూరగాయల, పప్పుధాన్యాల ఇతర చిరుధాన్యాల సేద్యం, కేవలం వరి, పత్తి, మిర్చి సాగు మాత్రమే పెరిగింది. సంవత్సరం పొడుగున పని దొరికి వ్యవసాయ పనులు చేసే కూలీలకు చేతి నిండా పనులువుండేవి.   లావాదేవీదిలు నగదు రూపాయలతో కాకుండా వాస్తు మార్పిడితో అందరికీ అందుబాటులో అన్ని నిత్యావసర ఆహార ధాన్యాలు ఉండేవి. రైతులకే కాదు కూలీలకు ఇతర వృత్తుల వారికి అందుబాటువుండేవి ఏవో కొన్ని oటికి మాత్రమే దుకాణాలు మార్కెట్ మీద పట్టణాల మీద ఆధారపడేవాళ్లు.  కానీ నేడు ప్రతిదీ కొనుగోలు మార్కెట్ మీదనే ఆధార పడుతున్నారు.ఫలితంగా మనుషుల చేతిలో డబ్బుల కొరత ఏర్పడుతున్న‌ది. మనుషులలో వచ్చిన మార్పులు,
పంటపొలాల్లో పెరిగిన యాంత్రికత ఒకవైపు . ఫ‌లితంగా వ్యవసాయ పనుల్లోకి వెళ్లే శ్రామికుల సంఖ్య తగ్గింది. 35 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులు నేడు వ్యవసాయ పనుల్లో పాల్గొన‌డంలేదు. అంటే అర్ధం అందరూ చదువుకొని ప్రభుత్వఉద్యోగాల్లు చేస్తున్నారని కాదు.కొoతమంది నిర్మాణరంగంలో పని చేస్తున్నారు.కొంతమంది పట్టణాలలకు వలసవెళ్లి నిర్మాణ రంగంలోనూ ఉబర్, ఓలాలలో, డ్రైవర్ లు గాను,  బైకులను నడుపుతూ ఇటీవల బాగా ఉనికిలో ఉన్న గ్రిగర్స్ డోర్ డెలివరీ బాయ్స్ గానో,అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ లాగానో మహిళలు కొంతమాత్రమే షాపింగ్ మాల్స్ లోని పని చేస్తూ బతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నామ‌న్న రీతిలో అరకొర సంపాదన తో కాలం వెళ్ళబుచుతున్నారు. అలా పట్టణాలకు వలస వెళ్లినవారు. పిల్లల చదువులకు,పట్టణ నాగరికం పేరుతో నో కనీస అవసరాల పేరుతోనో ఇన్‌స్టాల్‌మెంట్ లో టివి లు,ఫ్రిజ్ లు బైకులు సెల్ ఫోన్ లు కొనుగోలు చేసి తమ సంపాదన లో వాటికి చెల్లించడం పనిదొర‌క‌క‌ పోతే వారం చిట్టి లు ఎత్తి వాటిని తీర్చడానికి నానా తండాలు పడుతున్నారు. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చూపించుకోవడానికి మళ్లీ అప్పుల మీదనే ఆధారపడుతున్నారు. ఊర్లో జరిగే బంధుమిత్రుల కార్యక్రమాలకు హాజరు కావడానికి అప్పులతోనే తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు . ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత అస్థిరత్వం తోటి కొనసాగుతూ ఉంటే వీటి గురించి పాలకులు ఆలోచించడం లేదు పల్లెలు భారతదేశానికి పట్టుకొమ్మలుగా చెప్పబడి నానుడి నేడు పల్లెలు జీవనాధారాన్ని కోల్పోయి జీవ సంస్కృతిని కోల్పోయి ఉంటున్న పరిస్థితి.  పైకి బానే కనిపిస్తోంది అంతా బాగున్నట్టుగానే అని పాలకులు ఇచ్చే పిలుపు లాగానే ఉంటుంది కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సంక్షేమ పథకాలు ఈ సంక్షోభ గాయాన్ని మానిపించే మందులు మాత్రం కావు వృద్ధిరేట్లను అంకెల గార‌డీతో చెప్పకుండా నిర్దిష్టంగా మనిషి జీవన ప్రమాణాన్ని అర్థం చేసుకొని వాటికనుగుణంగా ప్రణాళికలు రూపొందించకుండా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎన్ని ఐటి హ‌బ్బులు తెచ్చినా ఆ పేరుతో ఎంత ప్రభుత్వ భూములు దారాదత్తం చేసినా ఉపయోగపడేది కాదు . అందువ‌ల్ల  ప్రభుత్వాలు ఇప్పటికైనా ఓట్లు కేంద్రంగా కాకుండా మనుషుల కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి అలా రూపొందిస్తేనే భారత గ్రామాలు ఆనందంతో వెల్లి విరుస్తాయి. శోభను కోల్పోయిన చేతివృత్తులను పునరుద్ధరించి స్థానికంగా పండే పంటల అనుబంధ పరిశ్రమలను అభివృద్ధిపరిచి యువతకు ఉపాధి కల్పించినట్లయితే గ్రామాలు ఆర్థికంగా నిల దొక్కుకోగలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *