– ఎన్నికల హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకున్న ఐటీ ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముత్తారం మండలం పోతారం గ్రామ ప్రజల చిరకాల స్వప్నం అయిన పోతారం గ్రామ చెరువు కట్ట ను అభివృద్ధి పరిచి దాని మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని గత ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గ అభ్యర్థి అయిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతోనే పనులను పూర్తి చేస్తనని ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా నేడు రూ.2 కోట్ల కేటాయించినందుకు గాను గ్రామస్తులు మంత్రిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




