– గదిలో బంధించడంతో పోలీసుల జోక్యం
సూర్యాపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 15:ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడవుడి నడుస్తున్నది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి నాగరాజును గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్ పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తునున్నారు. నాగరాజు వ్యవహారంపై గ్రాస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని గదిలో బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటే.. ఓడిన అభ్యర్థులు కొన్నిచోట్ల ఆందోళన చేస్తున్నారు. తమ వద్ద డబ్బు తీసుకొని వేరే వాళ్లను గెలిపించారని ఆరోపిస్తూ.. తిరిగి డబ్బు చెల్లించాల్సిందిగా వోటర్లను ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులపై ఓడిన అభ్యర్థులు దాడులకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





