గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం
– పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించామని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రుల నాయకత్వంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గ్రామస్థాయిలో సత్తా చాటిందన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్క•తి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ ‌పార్టీ సహించదు. రాళ్లు కాదు.. రాతి శిలలపై చెక్కిన చరిత్రే.. ఆదివాసీ అస్థిత్వానికి నిదర్శనం. ఇళ్ల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి పది ఇళ్లయినా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గత ఏడాదిన్నరలో కొన్ని వేల ఇళ్లు ఇచ్చిందని అన్నారు. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్‌-1, ‌గ్రూప్‌-2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్లమంటగా మారింది. తాడ్వాయి ప్రాంతంలో ఆదివాసీ మహిళ గెలిస్తే భూములు లాగేసుకుంటారని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం నీచమైన రాజకీయం. మా ఆదివాసీ దేవుళ్ల జోలికి వచ్చినా, మా అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా ఊరుకునేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *