మహిళ భాగస్వామ్యంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

– బాలికా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే
– జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా

తిరుపతి, సెప్టెంబర్‌ 15: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటిచోట సాంకేతిక సహాయంతో బాలికలు విద్యావంతులు అయ్యేలా చూడాలన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా రెండు రోజులపాటు చర్చలు జరిగాయన్నారు. ప్రతి మహిళకు భద్రత, ఆత్మ నిర్భరత అందించాలి. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్‌ సెంటర్‌ ఉండేలా చూడాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఆర్థిక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారంటూ మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తే భారత్‌ ఆర్థికంగా వృద్ధిచెందుతుందని చెప్పారు. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి, ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కమిటీలు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దేశంలోని ఆఖరి మహిళకు కూడా ఫలితాలు అందేలా ప్రణాళికలు ఉండాలని, పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఒక్కరూ మహిళల వృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రావిూణ స్థాయి నుంచే మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, అన్ని రాష్ట్రాల్లో విమెన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రావిూణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధించకపోతే మనం వికసిత్‌ భారత్‌ కల సాకారం చేసుకోలేం అని ఓం బిర్లా అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *