ఉద్యకారులు లేకుంటే సీఎం, మంత్రులు ఉండేవారా?

– వారికిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
– మండలిలో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి విజఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి గుర్తుచేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్‌ ఇస్తామని హా సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ విజయశాంతి వివరించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్‌ 2‌వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని.. అది కూడా ఇంకా నెరవేరలేదని విజయశాంతి చెప్పారు. ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను కాంగ్రెస్‌ ‌నెరవేరిస్తే మరో చరిత్ర అవుతుందని.. పట్టించుకోకుంటే చారిత్రక తప్పిదం అవుతుందని విజయశాంతి పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హాలు నిలబెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *