-కేరళ సీఎంతో చర్చకు సిద్దమని రేవంత్ సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణ అభివృద్దిపై చర్చకు సిద్ధమని కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వంపై కేరళం సీఎం పినరయి విజయన్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై తో చర్చకు తాను సిద్ధమని కేరళం సీఎం పినరయి విజయన్‌కి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 7వ తేదీన కేరళ రాజధాని తిరువనంతపురంలో ముఖాముఖి చర్చకు సిద్ధమని పినరయి విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాత డేటాతో సీఎం విజయన్ విమర్శలు చేశారని వివరించారు. 2023 డిసెంబర్ నాటికే ఆ పాత డేటా శకం ముగిసిందన్నారు. తెలంగాణ వృద్ధి రేటు టాప్‌లో ఉందని వివరించారు. 2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ 10.1 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని చెప్పారు. అలాగే 25.36 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చామని తెలంగాణ సీఎం సోదాహరణగా వివరించారు. గడచిన 28 నెలల్లో 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని గణాంకాలతో సహా వివరించారు. కేరళంలో బ్రెయిన్ డ్రైన్ పెరిగిపోయిందంటూ సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ఆ రాష్ట్రంలోని పారిశ్రామిక వృద్ధి సైతం కుంటుపడిందని తెలిపారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఫేమస్ డైలాగ్ ’నీ పో, మోనే విజయన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళంలోని పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.