– బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ వ్యవహారంలో ..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయనను గంటకుపైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీ షన్లపై ఆరా తీసినట్టు సమాచారం. విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం వెనుక గేటు నుంచి విజయ్ వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని ఆయనతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





