కల్తీ కల్లు బాధితులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: కూకట్‌పల్లి ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో అనధికారికంగా ఆరుగురు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైనవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఒకటి రెండు సీసాలు తాగిన వారి కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. కల్లులో సైకో ట్రాఫిక్‌ సబ్‌స్టాన్స్‌ కలిపినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎక్సైజ్‌ శాఖ కల్లు కాంపౌండ్‌ల నిర్వాహకులతో కుమ్మక్కయిందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయంటూ ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రతిరోజూ కల్లు కాంపౌండ్‌లలో తనిఖీలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రామచందర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *