హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : భారత ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో ఈనెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. 20వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్ భవన్‌లో రాత్రి బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని న్యూదిల్లీ తిరిగి వెళ్తారు. కాగా, ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ్ణా రావు సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రహదారుల నిర్వహణ, ప్రొటోకాల్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు ఏ విధమైన లోటు జరడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



