Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ ‌విడుదల

– నామినేషన్లకు 21 చివరితేదీ..25న ఉపసంహరణ

– సెప్టెంబర్‌ 9‌న రహస్య బ్యాలెట్‌ ‌ద్వారా ఎన్నిక

న్యూదిల్లీ ,ఆగస్ట్7: ‌సెప్టెంబర్‌ 9‌న జరగనున్న ఉపరాష్ట్రపతి (vice president) ఎన్నికకు భారత ఎన్నికల సంఘం(Election commission)  తాజాగా గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అధికారికంగా నామినేషన్‌ ‌పక్రియను ప్రారంభించింది. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం నామినేషన్లు (nominations) దాఖలు చేయడానికి ఆగస్ట్  21 చివరి తేదీ. నామినేషన్ల  ఉపసంహరణకు చివరి తేది ఆగస్ట్  25గా నిర్ణయించారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజే ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనివార్యంగా ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ ‌కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.రహస్య బ్యాలెట్‌ ‌(secret ballot) ద్వారా వోటింగ్‌ ‌జరుగుతుంది. ఎలక్టోరల్‌ ‌కాలేజీ సభ్యులు ఏ పార్టీ విప్‌కి కట్టుబడి ఉండనవసరం లేదు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. ఈ కారణంగా ఎన్‌డీఏ తన అభ్యర్థిని సులభంగా ఎన్నుకోగలదు. రెండు సభల ప్రస్తుత బలం 786. అభ్యర్థి గెలవడానికి 394 వోట్లు అవసరం. ఎన్‌డీఏకు లోక్‌సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు మొత్తం వోట్ల బలం 422. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *