హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలి మృతి

– ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి
– ప్రభుత్వం తరఫున రూ.30లక్షల పరిహారం ప్రకటన

బెంగళూరు, మార్చి 21 : కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. గర్భంతో ఉన్న హిప్పోను పరీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీ క్షా రెడ్డి త్యావరకొప్ప టైగర్, లయన్ సఫారీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద పశు వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె జూలోని సన్ కాపర్ పక్షికి చికిత్స చేయడానికి వెళ్లింది. పక్షికి చికిత్స పూర్తయిన తర్వాత గర్భంతో ఉన్న హిప్పో టెంపరేచర్ పరిశీలించేందుకు ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ హిప్పో ఆమెపై దాడి చేసింది. తలతో బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ఊపిరితిత్తులు, లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూ సిబ్బంది ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సమీక్షా రెడ్ది ప్రాణాలు విడిచారు. పశు వైద్యురాలి మృతిపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండ్రే స్పందించారు. సమీక్షారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, సవిÖక్షా రెడ్డి హెబ్బల్‌లోని వెటర్నరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 2023లో డిగ్రీ పూర్తి అయిన తర్వాత కొంతకాలంపాటు మంగళూరు సర్కిల్ వైల్డ్ లైఫ్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఫిబ్రవరి నుంచి శివమొగ్గ జూలో కాంట్రాక్ట్ బేసిస్ కింద పశు వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. జూలో విధుల్లో చేరి రెండు నెలలు కాకుండానే ఈ విషాదం చోటుచేసుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *