మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:‌మైనార్టీల  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలోని  రహమత్‌ ‌నగర్‌లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని  తెలిపారు.  ఒక్కసారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమత్‌ ‌నగర్‌లో రూ. 20 కోట్ల పనులు  మంజూరు చేశామన్నారు. తొందరలోనే ఆ పనులు మొదలుపెడతామని చెప్పారు. రహమత్‌ ‌నగర్‌ ‌లో ఉన్న శ్మశానవాటిక  సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు మంత్రి వివేక్‌.  ఈ ‌విషయం గురుంచి  కలెక్టర్‌, ‌వక్ఫ్ ‌బోర్డు చైర్మన్‌తో మాట్లాడి స్థలం కోసం సర్వే చేయమని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.  తొందరలోనే కు మంచి కబారస్థాన్‌ ‌నిర్మాణం చేస్తామన్నారు. మంచి స్థలం, రోడ్డు సమస్య లేకుండా కబరస్థాన్‌ ‌నిర్మిస్తామన్నారు. మైనార్టీల కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ పని చేస్తోందన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *