హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ఈనెల 17నవ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికల విధి నిర్వహణలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి వాజేడు వెంకటాపుర్ ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఆకస్మికంగా కుప్పకూలారు. ఎన్నికల సంబంధిత ఒత్తిడి కారణంగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన భౌతికకాయాన్ని హన్మకొండలోని వారి నివాసానికి తరలించగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం సందర్శించి నివాళులర్పించారు. ఎన్నికల విధుల సమయంలో ఆయన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





