మంత్రి పొంగులేటిని కలిసిన నరేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, అంకితభావం తెలంగాణ గళాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించడానికి ఎంతో దోహదపడతాయని మంత్రి అన్నారు. రాజ్యసభలో ఆయన పార్లమెంటరీ ప్రస్థానం విజయవంతంగా సాగుతూ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని మంత్రి పొంగులేటి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *