దేశభక్తి,నిపెంపొందించేది వేద విద్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: వేద విద్య పిల్లలలో జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. నాగోల్‌ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న వేదవ్యాస పాఠశాల ట్రస్ట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటిస్తూ సమాజాభివృద్ధి, భవిష్యత్‌ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. వేద విద్య సమాజానికి నైతిక బలం, దేశానికి సాంస్కృతిక గర్వం, విద్యార్థులకు దేశభక్తి దారిదీపం అవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా తాము తెల్లవారుజాము లేవగానే ప్రజల సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు వింటూ రాజకీయ జీవితంలో ఉంటాము. కానీ ఇక్కడకు రాగానే మన వేద సంపద, సంస్కృతి, ధర్మంలో ఉన్నట్లు అనిపిస్తున్నదన్నారు. ఇది ప్రత్యేకమైన అనుభవం, చాలా తక్కువమందికి మాత్రమే లభించే అదృష్టం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాని చెప్పారు. భారతదేశం గొప్ప దేశంగా ఎదగడంలో ప్రధాన కారణం ఇక్కడి వేద సంపదేనన్నారు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల కాలంలోనూ వేద సంపద దేశాభివృద్ధికి కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుత తరం వాటిని మరచిపోతున్న తరుణంలో తాము వేద పాఠశాలల్లో విద్యార్థులను దేశానికి, సంస్కృతికి ప్రతిబింబంగా, భవిష్యత్తులో భారతదేశ పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా మారుస్తున్నామని గర్వంగా చెప్పవచ్చని రాంచందర్‌ రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *