యాదగిరిగుట్ట ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రతీ సంవత్సరం మాదిరి శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం(15వ తేదీన) సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొండ కింద గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించుకొనుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొనే విశేషమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం కావున ఈ కార్యక్రమములో పాల్గొనదలచిన మహిళలు తమ పేర్లను కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతమండపం కార్యాలయంలో 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించనున్నట్లు, పూజా సామగ్రి కూడా దేవస్థానం వారే ఇస్తారని ఈవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *