స్వాతంత్య్రోద్యమానికి ప్రేరేపించిన గీతం వందేమాతరం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌
– మహబూబియా గర్ల్స్‌ హైస్కూలులో 150 సంవత్సరాల వేడుకలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అబిడ్స్‌ మహబూబియా గర్ల్స్‌ హైస్కూల్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రజలకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మనల్ని ప్రేరేపించిన గీతం వందేమాతరం అంటూ సామూహిక ఆలాపన ద్వారా మన జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. గొప్పగొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మీకు దక్కింది.. మీరు ఉజ్వల భవిషత్తును తీర్చిదిద్దుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, డీఈవో రోహిణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నరసింహారెడ్డి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *