యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయం ముందు ఆలయ అధికారులు వందేమాతర గీతాన్ని శుక్రవారం ఆలపించారు. దేశ జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది, సంస్కృత పాఠశాల విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆలయ కార్యాలయం ముందు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు సురేంద్రచారి,తిర అర్చకులు, ఈవో దయాకర్ రెడ్డి, ఏఈవోలు గజవల్లి రఘు, నవీన్, జె.కృష్ణ, మహేష్, ఎస్పీఎఫ్ సి.ఐ. శేషగిరిరావు, సిబ్బంది, సంస్కృత పాఠశాల విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



