20‌కి పెరగనున్న కోచ్‌ల సంఖ్య

– సికింద్రాబాద్‌-‌తిరుపతి వందే భారత్‌కు ఆదరణ నేపథ్యంలో

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ‌వందే భారత్‌ రైళ్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందే భారత్‌ ‌రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీంతో కోచ్‌ల సంఖ్య 20కి పెరగనుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా మంగళూరు సెంట్రల్‌ ‌తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-‌తిరునల్వేలి మార్గాల్లో ప్రస్తుతం 16 కోచ్‌ల వందేభారత్‌ ‌నడుస్తుండగా.. దీనిని 20 కోచ్‌లకు పెంచనున్నారు. మిగతా నాలుగు మార్గాల్లో ఎనిమిది కోచ్‌ల రైళ్లు నడుస్తుండగా.. వాటి స్థానంలో 16 కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడు మార్గాల్లో కోచ్‌ల అప్‌‌గ్రేడ్‌తోపాటు మరిన్ని 20 కోచ్‌ల వందేభారత్‌ ‌రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చే 16, 8 కోచ్‌ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగిస్తామన్నారు.సికింద్రాబాద్‌-‌తిరుపతి, మంగళూరు సెంట్రల్‌- ‌తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-‌తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌, ‌దేవ్‌గఢ్‌-‌వారణాసి, హవ్‌డా-రౌర్కెలా, ఇందౌర్‌-‌నాగ్‌పుర్‌ ‌మధ్య నడిచే వందేభారత్‌ ‌రైళ్లలో ఎక్కువ కోచ్‌లు అందుబాటు-లో ఉండనున్నాయి.ప్రస్తుతం మూడు మార్గాల్లో 16 కోచ్‌లు, నాలుగు రూట్‌లలో ఎనిమిది కోచ్‌ల వందేభారత్‌ ‌రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 కోచ్‌ల రైలును 20 కోచ్‌లతో, ఎనిమిది కోచ్‌ల రైళ్ల స్థానంలో 16 కోచ్‌లకు అప్‌‌గ్రేడ్‌ ‌చేయనున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ (‌ప్రజా సంబంధాలు) దిలీప్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) వందేభారత్‌ ‌రైళ్ల రద్దీ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని అందుబాటు-లో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *