– ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వినతి
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వనమా సూరి తన స్వగృహంలో ఇచ్చిన ఆత్మీయ అల్పాహార విందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరి కుటుంబ యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా, పట్టణ వైశ్య నాయకులు మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఒక్క ఇందిరమ్మ ప్రజాప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఆర్య వైశ్యుల అభివృద్ధికి ఇందిరమ్మ ప్రజాప్రభుత్భం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వారంతా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చెప్పారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి భట్టి విక్రమార్క అల్పాహారం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులను పేరుపేరునా పలకరిస్తూ వారి కుటుంబాల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎంన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్హులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.



