బీఆర్‌ఎస్‌ ఆడే పోటీలను నిర్వహించలేం

– మత్తు వదిలించుకోవడానికే మైదానానికి రమ్మన్నాం
– వారు ఆడలేమంటే వారి ఆటలు పెట్టలేం కదా
– క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదన్న కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై వాకిటి కౌంటర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనబోమంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు. మైదానంలోకి తాము రామంటూ కేటీఆర్‌ అం‌టుంటే ఏం చేయగలమని అన్నారు. ’మావి వేరే గేమ్స్, ‌కేటీఆర్‌వి మరో రకమైన గేమ్స్’ అం‌టూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు ఆడే గేమ్స్ ‌పెట్టడం సాధ్యం కాదు కదా? అంటూ మంత్రి వాకిటి శ్రీహరి చురకలు అంటించారు . తాము ఫిట్‌ ‌తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామని.. ఆరోగ్య తెలంగాణ ఉండాలని సీఎం ఆలోచన చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు డ్రగ్స్ ‌వంటి ఆలోచనలు రాకుండా ఆటల వైపు మళ్లుతారని వాకిటి పేర్కొన్నారు. కాగా, నేటి నుంచి రెండ్రోజులపాటు జరిగే లెజిస్లేచర్‌ ‌స్పోర్టస్ ‌ట్‌-2026‌లో తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనరంటూ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఓ ‌ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా క్రీడా పోటీలు అవసరమా అంటూ ప్రశ్నించారు. శాసనసభ సమయం వృథా చేయడం తగదని.. కనీసం ఇంకో 10 రోజులు సమావేశాలను కొనసాగించాలని అన్నారు. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ పైవిధంగా కౌంటర్‌ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *