– దేశ రక్షణకోసం ఎంతో కృషిచేశారు
– సర్వశిక్ష అభియాన్ ఆయన చలవే
– 101 జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి మంచి వక్త, మంచి పరిపాలనాదక్షుడు, విలువలు కలిగిన మహా నేత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.అటల్ జీ 101వ జన్మదినం సందర్బంగా దేశమంతా ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ పేరుతో విద్యాలయాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశారని చెప్పారు.. పేద ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యుదయం కోసం అనేక సంస్కరణలు తీసుకోచ్చిన నేత అటల్ అని అన్నారు. ఆయన ప్రసంగాలు, వ్యక్తిత్వం దేశ యువతకు మార్గదర్శిగా నిలిచాయన్నారు. పాకిస్థాన్ వెన్నుపోటు పొడిస్తే తిరిగి పాక్‌కు మూడు చెరువుల నీళ్ళు తాగించి పాక్‌ను మట్టికరిపించిన ఘనత అటల్‌కు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఒక దేశం నుండి మరొక దేశానికి.. దిల్లీ నుంచి లాహోర్‌కు బస్‌లో వెళ్లిన మొదటి ప్రధాని మోదీ అని తెలిపారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశ వ్యాప్తంగా రోడ్ల విస్తరణ చేసిన ఘనత ఆయనది అని అన్నారు. దేశ ప్రగతిలో తనదైన ముద్ర వేసుకున్న మహానుభావుడన్నారు. దేశ యువతకు అటల్ జీ జీవితం ఒక స్పూర్తి అనితెలిపారు. నేడు వాజ్‌పేయికు యావత్ దేశం ఘనంగా నివాళి అర్పిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.