నాణ్య‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు

-లిప్టుల నిర్వ‌హ‌ణ‌లో రైతుల భాగ‌స్వామ్యం
-కోదాడ‌, హుజూర్‌న‌గ‌ర్ బ‌స్టాండ్‌ల ఆధునికీక‌ర‌ణ‌
– మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర , ఆగస్టు 5 :  లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల  లో అభివృద్ధి కార్యక్రమాల పై హైద్రాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగ‌ళ‌వారం ఆయన‌తో పాటు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్లకుంట లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 4460 ఎకరాలకు రూ.47.64 కోట్ల వ్య‌యంతో పాలేరు వాగు పై నిర్మిస్తామ‌న్నారు. రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ఇరిగేషన్ ని రూ.54.03 కోట్ల వ్య‌యంతో 5000 ఎకరాలకి పాలేరు వాగు ద్వారా అందిస్తామ‌న్నారు. ఆర్‌9 లిప్ట్ ఇరిగేషన్ మునగాల, నడిగూడెం మండలాలకి చెందిన 3500 ఎకరాలకి రూ.8.45 కోట్లతో నిర్మిస్తామ‌న్నారు.  మోతే లిప్ట్ ఇరిగేషన్  ని రూ.244 కోట్లతో 45,736 ఎకరాలకి  4.5 టి ఎం సి ల నీరు సరఫరా చేస్తామ‌ని తెలిపారు. పులి చింతల ద్వారా విద్యుత్ తయారీ చేసిన నీటి ద్వారా రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాలకి చెందిన 14100 ఎకరాలకు రూ.320 కోట్ల తో నిర్మిస్తామ‌న్నారు. కోదాడ బస్ స్టాండ్ ని ఆధునికరణ బస్ స్టాండ్ గా నిర్మించేందుకు రూ.16.89 కోట్లు, హుజూర్ నగర్ లో బ‌స్టాండ్ కొరకు రూ.3.52 కోట్లు  మంజూరు చేశామని పంద్రాగస్ట్ రోజు కోదాడ, హుజూర్ నగర్ ఆధునికరణ బస్ స్టాండ్లకి శంకుస్థాపన చేస్తామన్న‌రు. అధికారులు ఇందుకు త‌గిన ఏర్పాటు చేయాలని,  6 నెలల లోపు నిర్మాణాల‌ను పూర్తి  చేయాలని ఆదేశించారు.ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ,పార్కింగ్, కాంటీన్, ఏ సి వెయిటింగ్ హల్, పిడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *