– ఏఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
– మంత్రి ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః నీటిపారుదల రంగానికి ఇంజినీర్లు ములస్తంభాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సంఘం రూపొందించిన క్యాలెండర్ తో పాటు డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ నీటిపారుదల రంగం బలోపేతానికి ఇంజినీర్లు మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి, అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకాష్, వెంకట్ నారాయణ, ఉషారాణి, మహేందర్ నాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఈఈల క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటిపారుదల రంగాన్ని మరింత పతుష్టవంతం చేయాలని మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని అవాంతరాలను అధిగమించి ఏఈఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సచివాలయంలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రూపొందించిన క్యాలెండర్, డైరీని మంత్రి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.నాగరాజు, కోశాధికారి సంతోష్, యాదాద్రి బోనగిరి జిల్లా అధ్యక్షుడు మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు మహేంద్రనాధ్, జాయింట్ సెక్రటరీ సుష్మ, జయశ్రీ, అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




