బనకచర్లకు కేంద్రం నిరాకరణపై మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: గోదావరి-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్ పాలనలో అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయమై తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయన్నారు. డాక్టర్ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి జలాలపై ఆయన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తవమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గోదావరి జలాశయాలలో తెలంగాణ నీటి వాటాను కాపాడుకునేందుకు ఆంద్రప్రదేశ్ ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను స్వయంగా కేంద్రానికి వివరించినందునే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారన్నారు. ఇది ముమ్మాటికీి కాంగ్రెస్ ప్రభుత్వ విజయమేనన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో నాటి తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చలు జరిపారని, ఈ మోసానికి అప్పుడే పునాది పడిరదన్నారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారని, 2018 మార్చి, జూన్, సెప్టెంబర్‌లలో ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా జీవోలు ఇచ్చినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదని విమర్శించారు. జీవోఎంఎస్ 98 పేరుతో నిధులు మంజూరు చేసినా అడ్డు చెప్పలేదన్నారు. గోదావరి జలాలు కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు అప్పటి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపిందే కేసీఆం..్ రెండు రాష్ట్రాల నడుమ అధికారులు-నిపుణులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయగా నాటి పాలకులు అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పుడు తమ ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.





